25-07-2025 02:47:03 AM
మిట్రల్ వాల్వ్ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 24 (విజయక్రాంతి): మలక్‌పేటలోని కేర్ హాస్పిట ల్స్ వైద్యులు నల్లగొండకు చెందిన కేవలం 30 కిలోల బరువు మాత్రమే ఉన్న 29 ఏళ్ల మహిళకు మిట్రల్ వాల్వ్ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. రజిత (పేరు మార్చబడిం ది) శ్వాస ఆడకపోవడం, దడ వంటి సమస్యలతో మలక్‌పేటలోని కేర్ హాస్పిటల్‌లో చేరింది. వైద్య పరీక్షలలో ఆమె తీవ్రమైన మిట్రల్ వాల్వ్ వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడైంది.
ఈ పరిస్థితి ఎడమ గుండె గదుల మధ్య వాల్వ్ సరిగ్గా మూసుకుపోదు. ఆమెకు హైపోథైరాయిడిజం కూడా ఉంది. కార్డియోథొరాసిక్, వాస్కులర్ సర్జన్ డాక్టర్ సుధీర్ గండ్రకోట మాట్లాడుతూ.. “ఆమె 29 ఏళ్ల వయస్సు ఉన్నప్పటికీ, శరీర బరువు చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ కేసు చాలా క్లిష్టంగా మారింది. ఇది శస్త్రచికిత్సలో ప్రమాదాన్ని బాగా పెంచింది. ఆమెను పరీక్షించే సమయంలో, వైద్య బృందం ముందుగా తెలియ ని పాక్షిక మూర్ఛల సమస్యను కూడా గుర్తించింది.
దీని వల్ల ఆమె ఆరోగ్య పరిస్థితి మరిం త సంక్లిష్టంగా మారింది. ఈ కారణాల వల్ల, శస్త్రచికిత్స సమయంలో ఆమెకు 15శాతం కంటే ఎక్కువ ప్రమాదం ఉందని లెక్కించారు” అని చెప్పారు. సీనియర్ కార్డియోథొరాసిక్, వాస్కులర్ సర్జన్ డాక్టర్ సుధీర్ గండ్రకోట నాయకత్వంలో కార్డియాక్ టీం ముందుగానే జాగ్రత్తగా ప్లాన్ చేసి, శస్త్రచికిత్స తర్వాత కూడా మంచి పరిరక్షణ అందించింది. ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయ్యింది.
నాలుగో రోజుకే రోగిని స్థిరమైన ఆరోగ్య పరిస్థితిలో డిశ్చార్జ్ చేశారు. ఇది మా బృందానికి గర్వంగా అనిపించే విషయమని డాక్టర్ సుధీర్ చెప్పారు. మలక్పేటలోని కేర్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్.. ‘ఈ విజయవంతమైన శస్త్రచికిత్స మా ఆసుపత్రిలో ఉన్నతమైన వైద్య సేవలు, డాక్టర్ల సమిష్టి కృషికి మంచి ఉదాహరణ” అని చెప్పారు.