12-08-2024 01:33:48 AM
అదానీపై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను సమగ్రంగా దర్యాప్తు చేశామని క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆదివారం ప్రకటించింది. తమ చైర్‌పర్సన్ మాధబిపురి బుచ్ ఎప్పటికప్పుడు సంబంధిత డిస్‌క్లోజర్స్ చేశారని, అవసరమైన సందర్భాల్లో అదానీ దర్యాప్తు నుంచి తప్పుకున్నారని రెగ్యులేటర్ వెల్లడించింది. అదానీకి సంబంధించిన 26 దర్యాప్తుల్లో చివరివి ప్రస్తుతం పూర్తి కావొచ్చాయని తెలిపింది. అదానీకి సంబంధించిన విదేశీ ఫండ్స్‌లో బుచ్‌కు వాటాలు ఉన్నందున, అదానీ గ్రూప్‌పై చర్యలు తీసుకోవడానికి సెబీ వెనకడుగు వేస్తున్నదంటూ తాజాగా హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణపై సెబీ ఈ ప్రకటన చేసింది.