calender_icon.png 7 July, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదానీ షేర్లలో పెట్టుబడులు చేయలేదు

12-08-2024 01:39:21 AM

360 ఒన్ వెల్లడి

అదానీ గ్రూప్ షేర్లలో తమ ఐపీఈ ప్లస్ ఫండ్ 1 ఎటువంటి ఎటువంటి పెట్టుబడులు చేయలేదని వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ 360 ఒన్ (గతంలో ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ మేనేజ్‌మెంట్) ఆదివారం వెల్లడించింది. తమ ఈపీఈ ప్లస్ ఫండ్‌లోకి వచ్చిన నిధుల్లో సెబీ చైర్‌పర్సన్ మాధబి పురి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్‌ల పెట్టుబడులు 1.5 శాతంలోపేనని, తమ పెట్టు బడి నిర్ణయాల్లో ఏ ఇన్వెస్టర్ల పాత్ర లేదని 360 ఒన్ ఒక ప్రకటనలో వివరించింది. 2013 అక్టోబర్ నుంచి 2019 అక్టోబర్ వరకూ ఐపీఈప్లస్ ఫండ్ 1 నిర్వహణలో ఉన్నదని, ఆ సమయంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షం గా అదానీ గ్రూప్ షేర్లలో పెట్టుబడులు ‘జీరో’ అని తెలిపింది.

తమ ఫండ్ నిర్వహణలోని ఆస్తులు గరిష్ఠంగా 48 మిలియన్ డాలర్లకు చేరాయని, 90 శాతంపైగా నిధుల్ని బాండ్ల లోనే ఇన్వెస్ట్ చేసినట్టు వెల్లడించింది. ఇండియా ఇన్ఫోలైన్ నిర్వహణలోని ఐపీఈప్లస్ ఫండ్‌లో సెబీ చైర్‌పర్సన్, ఆమె భర్త పెట్టుబడి 2015లో చేశారని, అందులోనే గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీకి పెట్టుబడులు వున్నాయని హిండెన్‌బర్గ్ చేసిన తాజా ఆరోపణలను ఖండిస్తూ 360 ఒన్ ఈ వివరణ ఇచ్చింది. ఈ ఫండ్‌లో పెట్టుబడి చేసిన తర్వాత 2017లో మాధబిపురి బుచ్ సెబీ పూర్తికాలపు సభ్యురాలిగా నియమించబడ్డారని, తదుపరి 2022లో చైర్మన్‌గా ఎంపికయ్యారని హిండెన్‌బర్గ్ ఆరోపించింది.