calender_icon.png 6 July, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్లో ఎల్‌ఐసీ రూ.1.30 లక్షల కోట్ల పెట్టుబడులు

12-08-2024 01:28:15 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో రూ. 1.30 లక్షల కోట్ల తాజా పెట్టుబడులు చేసేందుకు తగిన అవకాశాల కోసం అన్వేషిస్తున్నట్టు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) ఎండీ, సీఈవో సిద్ధార్థ మొహంతి వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ మధ్యకాలంలో రూ.38,000 కోట్ల విలువైన షేర్ల ను కొనుగోలు చేశామని, గత ఏడా ది ఇదేకాలంలో తాము మార్కె ట్లో రూ.23,300 కోట్లు పెట్టుబడి చేసినట్లు తెలిపారు. గత 2023 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ రూ.1.32 లక్షల కోట్ల మేర కొనుగోళ్లు జరిపింది. ప్రస్తుతం ఎల్‌ఐసీ వద్ద రూ.15 లక్షల కోట్ల విలువైన వివిధ కంపెనీల షేర్లు ఉన్నాయి. జూన్ 30నాటికి 282 కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి.