12-05-2025 12:45:03 AM
నాగార్జునసాగర్, మే 11: బుద్ధుడి చెంతకు.. ముద్దు గుమ్మలు.. ప్రపంచ సుందరీమణుల సోమవారం నాగార్జునసాగర్కు రానున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలోఆసియా దేశాలకు చెందిన 30 మంది మిస్ వరల్ పోటీ దారులు నాగార్జునసాగర్ విజయవిహార్ అతిథి గృహానికి చేరుకుని ముస్తాబవుతారు. విజయ విహార్ వెనుక భాగాన సాగర తీరాన సుందరీ మణులు మీడియా కోసం గ్రూప్ ఫొటోలు దిగుతారు.
విజయ్ విహార్ నుండి ప్రపంచ సుందరీమణులు సాయంత్రం బుద్ధవనానికి చేరుకుంటారు. బుద్ధవనం స్వాగతం తోరణం నుంచి నుంచే తెలంగాణ సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలుకుతారు. రేపు బుద్దపూర్ణిమ కావడంతో బుద్ధుడి పాదాల వద్ద అందగత్తెలు పుష్పాంజలి ఘటిస్తారు. మహా స్తూపం వద్ద ఫొటో షూట్లో పాల్గొంటారు. మహాస్తూపంపై ఉన్న విగ్రహాల గురించి వారికి ప్రముఖ బౌద్ధ విశ్లేషకుడు డాక్టర్ ఈమని శివనాగి రెడ్డి వివరిస్తారు.
మహాస్తూపం లోపల ముద్దు గుమ్మలు అష్టబుద్ధుల వద్ద కొవ్వొత్తులు వెలిగిస్తారు. ఆ తర్వాత మహాస్తూపం లోపల మూడు నిమిషాలు ధ్యానం చేసి ఐదు నిమిషాల పాటు మాంగ్స్ చాటింగ్లో పాల్గొంటారు. హైదరాబాద్ లో నిర్వహిస్తోన్న మిస్ వరల్ పోటీల్లో భాగంగా ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ ముస్తాబవు అయింది. 40 దేశాలకు చెందిన మిస్‌వరల్ కంటెస్టెంట్స్‌ఈనెల12న బుద్ధవనాన్ని సందర్శించేందుకు సాగర్ కు వస్తున్నారు. దీంతో విజయ విహార్ ను అధికారులు సుందరీకరిస్తున్నారు.
ఇందుకు రూ. 5 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నెల రోజులుగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మిస్‌వరల్ కంటెస్టెంట్స్ ముందుగా బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించి, మహాస్థూపం అంతర్భాగంలోని ధ్యాన మందిరంలో ధ్యానం చేశాక జాతకవనంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. బుద్ధవనం ప్రవేశద్వారం నుంచి మహాస్థూపం వరకు విద్యుత్ లైట్లతో ప్రత్యేకంగా అలంకరి స్తున్నారు. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నిత్యం పర్యవేక్షిస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
బుద్ధవనం.బుద్ధుడి జాతక పార్కు.
మహా స్తూపం నుంచి జాతక పార్కును సందర్శించి బుద్ధుడి చరిత్ర, తెలంగాణ బుద్ధిజం, బౌద్ధ విశేషాలు తెలుసుకుంటారు. అక్కడే బుద్ధ చరితపై డ్రామా ఉంటుంది. బుద్ద వనంలో డిన్నర్లో పాల్గొని హైదరాబాద్ బయలు దేరుతారు. అందాల భామలు స్టే చేయనున్న విజయ విహార్,
బుద్ధవనం, మహా స్తూపానికి విద్యుత్ దీపాలతో అధికారులు అలంకరించారు.మిస్ వరల్ పోటీదారులకు ఎలాంటి ఆసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయడంతో పాటు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే విజయ్ విహార్ బుద్ధవనం లను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భద్రతకు మూడంచల వ్యవస్థ ఏర్పాటు చేసింది