calender_icon.png 28 January, 2026 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు

28-01-2026 12:29:26 AM

  1. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం

ఫిబ్రవరి ౧న కేంద్ర బడ్జెట్.. చరిత్రలో తొలిసారి ఆదివారం ‘పద్దు’

ఇదే నెల ౧౩ వరకు మొదటి విడత సమావేశాలు

మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత

న్యూఢిల్లీ, జనవరి ౨౭: పార్లమెంట్‌లో బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీనిలో భాగంగానే మంగళవారం ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. మొదటి విడత సమావేశాలు ౨౮న మొదలై ఫిబ్రవరి ౧౩న ముగుస్తాయని, అలాగే రెండో విడత సమావేశాలు మార్చి 9న ప్రారంభమై ఏప్రిల్ 2న ముగుస్తాయని, సభ సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రి కోరారు.

మరోవైపు సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గురువారం ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి ౧న ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. భారత చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. బడ్జెట్‌పై పన్ను చెల్లింపుదారులు గంపెడాశలు పెట్టుకున్నారు. కేంద్రం కొత్త పన్ను విధానం తీసుకుచ్చి, తమపై పన్నుల భారం తగ్గిస్తుందని ఆశిస్తున్నారు.