calender_icon.png 28 January, 2026 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం కోర్టులో పిటిషన్లు

28-01-2026 12:30:40 AM

న్యూఢిల్లీ, జనవరి ౨౭: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఇటీవల విడుదల చేసిన ‘ఈక్విటీ’ నిబంధనలకు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ మంగళవారం సుప్రీంకోర్టులో మరో కీలక పిటిషన్ దాఖలైంది. యూజీసీ నిబంధనలు కేవలం కొన్నివర్గాలకే రక్షణ కల్పించి, మిగిలిన వారిని విస్మరిస్తున్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు.

ఉన్నత విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రక్షణ కల్పించడం కోసమే ఈ నిబంధనలు తెచ్చామని యూజీసీ చెప్తున్నదని, కానీ.. జనరల్ కేటగిరీ విద్యార్థుల సంగతేంటని ఆ వర్గం విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదు చేసే అవకాశం ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు అవకాశం ఉన్నట్లే, తమకూ ఫిర్యాదు చేసే అవకాశ ఉండాలని నొక్కిచెప్తున్నారు. దీనిలో భాగంగానే కొందరు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు.

మరోవైపు కేంద్ర విద్యాశాఖ మాత్రం కొత్త నిబంధనలు ఎవరికీ వ్యతిరేకం కావని స్పష్టం చేస్తున్నది. రోహిత్ వేముల, పాయల్ తడ్వి వంటి వారి బలవన్మరణాల తర్వాత, మరో విద్యార్థి అలా వివక్షకు గురికాకూడదనే ఉద్దేశంతోనే కొత నిబంధనలు తెచ్చామని చెప్తోంది. ఈ  నేపథ్యంలోఅత్యున్నత న్యాయస్థానం పిటిషన్లపై ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.