10-07-2025 10:03:30 PM
చిన్న చింతకుంట: ప్రజాపాలనలో భాగంగా దేవరకద్ర శాసనసభ్యులు జి.మధుసూదన్ రెడ్డి(MLA G. Madhusudan Reddy) ఆదేశాల మేరకు ఎస్ వెంకటేష్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులతో కలిసి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం రోజున ఇళ్ల నిర్మాణాలకు ముగ్గు వేసి పనులు ప్రారంభించారు. మండల కేంద్రానికి చెందిన లబ్ధిదారులైన డి. సుజాత, రాజమోని అనురాధ, షబానా బేగం, రేషం మంజుల, బందేల జయమ్మ వాళ్లతో ఈ సందర్భంగా ఎస్ వెంకటేష్ మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పరచి నిర్మాణ విధానాన్ని తెలిపారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల లబ్ధిదారులు ప్రభుత్వానిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసుకోవాలని, సకాలంలో ఇళ్లు పూర్తి చేసుకొని ప్రభుత్వం అందిస్తున్న రూ. 5 లక్షల ఆర్థిక సాయం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ వెంకటేష్ , ప్రతాప్, పెంటన్న, ఇందిరమ్మ గ్రామ కమిటీ సభ్యులు గౌస్, ఎస్ శేఖర్,పంచాయతీరాజ్ సెక్రెటరీ సంతోష్ లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.