10-07-2025 10:01:03 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District)లో ఆయిల్ పామ్ పంట సాగు పట్ల రైతులకు అవగాహన కల్పించడంతో పాటు, పంట విస్తీర్ణాన్ని మరింత పెంచడంలో భాగంగా గురువారం వివిధ మండలాల్లో 200 ఎకరాల్లో వేడుకగా మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయిల్ పామ్ పంట వల్ల రైతులకు లభించే ఆదాయాన్ని, పెట్టుబడి, సాగుకు అవసరమైన సూచనలు, దిగుబడి, ప్రభుత్వ ప్రోత్సాహం, అంతర పంటల సాగు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటకు ఎలాంటి నష్టం లేదని తదితర అంశాలతో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డిహెచ్ఓ మరియన్న, ఏడిఏలు శ్రీనివాస రావు, విజయ్ చంద్ర, ఆయిల్ ఫెడ్ అధికారి రాములు, రైతులు పాల్గొన్నారు.