calender_icon.png 20 September, 2025 | 5:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిందే

20-09-2025 03:44:55 PM

మహ్మద్ నిజాముద్దీన్ కుటుంబానికి అండగా ఉంటాం..

ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి.. 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): అమెరికాలో పోలీసుల ఫైరింగ్ చేత మహ్మద్ నిజాముద్దీన్ మృతిపై పూర్తిస్థాయిలో విచారణ నిష్పక్షపాతంగా జరపాల్సిన అవసరం ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) పేర్కొన్నారు. శనివారం మహబూబ్ నగర్ నగరంలోని బికెరెడ్డి కాలనీలో గల మృతుని ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుకోవడానికి అమెరికాకు వెళ్ళి అక్కడ ఒక మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించుకొని, జీవనం సాగిస్తున్న మన నగరానికి చెందిన నిజాముద్దీన్ అమెరికా పోలీసులు జరిపిన ఫైరింగ్ లో అకాల మరణం చెందారని, ఇది ఎంతో బాధాకరమైన విషయమని చెప్పారు. మృతుని మృతదేహాన్ని ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నామని, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో చర్చించామని, అందుకు సంబంధించి, సచివాలయం నుంచి విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖలు పంపించామని ఆయన తెలిపారు.

ఎంపీ కూడా చొరవ తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక అధికారిని నియమించిందని చెప్పారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా మృతదేహాన్ని ఇండియాకు రప్పిస్తామని తెలిపారు. నిజాముద్దీన్ మృతి పైన,  మృతుని కుటుంబ సభ్యులకు ఉన్న అనుమానాలను తొలగించాలంటే కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయాల్సిన బాధ్యత అమెరికా ప్రభుత్వం పైన ఉందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు సాదుల్లా, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు రాషెద్ ఖాన్, ఖాజా పాషా, ప్రశాంత్, అంజద్, ఉమర్, మోసిన్ తదితరులు పాల్గొన్నారు.