20-09-2025 03:46:37 PM
అదిలాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ సత్యరాజ్ ఉపారపు అన్నారు. గుడిహత్నూర్ మండలం లింగాపూర్ లోని ప్రాథమికొన్నత పాఠశాలలో శనివారం కళాజాత బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య పాఠశాల అవగహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా కళాజాత బృందం సభ్యులు విద్యార్థులకు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగహన కల్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సత్యరాజ్ ఉపారపు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశానుసరం గ్రామ పాఠశాలలో అవగహన కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని అన్నారు. జిల్లా కలెక్టర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని, ఆరోగ్యంగా ఉండాలని, విద్యార్థులకు వచ్చే సంక్రమిత, అసంక్రమిత వ్యాధులతో పాటు, సీజనల్ వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చరణ్ సింగ్, కళాజాత బృందం సభ్యులు రవి, మురళి, దుర్పత, ఉపాధ్యాయులు మాధవి, పాఠశాల కమిటీ చైర్మన్ పోలె విష్ణు కాంత్, గ్రామస్తులు భాస్కర్ బలవంత్, రాహుల్, ఓం కుమార్, సునీల్ తదితరులు ఉన్నారు