20-09-2025 04:01:18 PM
చిన్న చింతకుంట: దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని చాట్ చెబుతూ దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి(MLA Madhusudan Reddy) అమ్మవారి విగ్రహాన్ని అందించడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శనివారం మండలం కేంద్రంలోని ఈశ్వర స్వామి దేవాలయం దగ్గర నిర్వహించనున్న నవరాత్రుల సందర్భంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఆలయ అభివృద్ధికి సహకరించడం చాలా సంతోషకరంగా ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర నియోజకవర్గం మాజీ యూత్ అధ్యక్షుడు ఎస్ వెంకటేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్, జి.ప్రతాప్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వజిర్, బాబు, మహిముద్, ఎస్ శేఖర్, గౌస్, హరీష్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.