20-09-2025 04:22:16 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం గంగారం సెక్టార్ పరిధిలోగల కిష్టారం గ్రామ పంచాయతీ స్థాయిలో ఐసిడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐవైసిఎఫ్, వెయ్యి రోజుల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. అలాగే ప్రీస్కూల్ కార్యక్రమాన్ని వివరిస్తూ ప్రతి ఒక్క పిల్లవాణ్ణి అంగన్వాడీ సెంటర్ కి పంపించాలని ప్రీస్కూల్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ జి లక్ష్మి, ఏఎన్ఎం మానస, ఆశాలు అంగన్వాడీ టీచర్స్ తల్లులు పాల్గొన్నారు.