31 July, 2026 | 6:02 PM

అభివృద్ధి పనులను పరిశీలించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

20-09-2025 03:39 PM

కరీంనగర్ (విజయక్రాంతి): శాతవాహన యూనివర్సిటీ ముందుగల మహాత్మా జ్యోతిబా ఫూలే కూడలి సుందరీకరణకు ఇటీవల 15 లక్షల సుడా నిధులు విడుదల చెయ్యగా ఈ రోజు పనులు జరుగుతున్న తీరును సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి(Suda Chairman Komatireddy Narender Reddy) పరిశీలించడం జరిగింది. పనులలో నాణ్యత పాటించి త్వరిత గతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు నరేందర్ రెడ్డి సూచించడం జరిగింది.