05-08-2025 12:31:44 AM
- తలకు మించి పని భారం
- అధికారుల నిర్లక్ష్యం
- రైతుల చేయూత
- గిరిజన సహకార సంస్థ
- రేషన్ షాపు దుస్థితి
ములకలపల్లి, ఆగస్టు 4 (విజయ క్రాంతి)ఒకవైపు శిథిలమైన భవనం.. మరోవైపు తల కు మించిన భారం... వర్షాకాలం వచ్చిందం టే బిక్కు బిక్కుమంటూ జీవనం. అధికారు లు నిర్లక్ష్యంగా వ్యవహరించిన, రైతుల సహకారంతో అంతంత మాత్రం మరమత్ చేసు కొని నిరుపేద ప్రజలకు ప్రభుత్వం నుంచి సరఫరా చేస్తున్న బియ్యం, పంచదార, నిత్యవసర వస్తువులను సరఫరా చేస్తున్నాడు గిరి జన సహకార సంస్థ సేల్స్ మెన్ తేజావత్ అ గ్గిరాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలోని ములకల పల్లి మండల కేంద్రంలో గల గిరిజన సహకార సంస్థ నిర్వహిస్తున్న చౌక దుకాణం దీ నస్థితిలో ఉంది. 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం పూర్తి శిథిలావస్థకు చేరింది.
వ ర్షాకాలం వచ్చిందంటే సేల్స్ మెన్ కంటిమీద కునుక్కు ఉండని పరిస్థితి ఉంది. మం డల కేంద్రమైన ములకలపల్లి తో పాటు పరిసర గ్రామాల కు చెందిన 1400 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డు ద్వారా ప్రతినెల 250 క్వింటాళ్ల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే మూ డు నెలల స్టాకును నిల్వ ఉంచాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించే ఈ రేషన్ షాప్ శిథిలావస్థలో ఉండటంతో వ ర్షం కురిస్తే నిత్యవసర సరుకులు తడిసి ముద్దవుతున్నాయి. తడిసిన సరుకులను లబ్ధిదారులు తీసుకోవడానికి నిరాకరించడంతో సేల్స్ పెన్ పై పెను భారం పడుతుంది. రేషన్ షాపు దుస్థితిని ప్రత్యక్షంగా చూసిన స్థానిక చిలకపాటి
జయచందర్రావు అనే రైతు రూ 30వేలు, సేల్స్ మెన్ తన సొంత ఖర్చులు రూ 20 వేలు ఖర్చు చేసి తాత్కాలికంగా మరమత్తు చేయించారు. రేకుల సందు నుంచి వర్షపు జల్లులు పడి బియ్యం పంచదార ఇతర నిత్యవసర సరుకులు తడిసి ముద్ద అవుతున్నా యి. చౌక దుకాణం పరిస్థితిపై జిసిసి ఉన్నతాధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన నూత న భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇవ్వటమే తప్ప కార్యరూ పం దాల్చలేదు. దీంతో ప్రతి ఏటా నిత్యవసర సరుకులు చెడిపోతున్నాయని సేల్స్ మె న్ వాపోతున్నాడు. ఇప్పటికైనా జీసీసీ ఉన్నతాధికారులు నూతన భవనం నిర్మించాలని, అప్పటివరకు తాత్కాలికంగా అద్దె భవనాన్ని తీసుకొని చౌక దుకాణాన్ని తరలించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాను
శిధిలావస్థ భవనం పరిస్థితి ని పలుమార్లు జెసిసి ఉన్నదొక అన్నదాధికారుల దృష్టికి తీ సుకెళ్లాను. కొత్త భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని చెప్తున్నారు తప్ప మంజులు చేసిన దాఖలా లేవు. ప్రతి ఏటా నిత్యవసరకులు తడిసి చెడిపోతున్నాయి. తడిసి న వస్తువులను లబ్ధిదారులు తీసుకోవడమే నిరాకరిస్తున్నారు. కొత్త భవనం మంజూరయ్యేంత వరకు తాత్కాలికంగా అద్దె భవనానికి మార్చాల్సిన అవసరం ఉంది.
సేల్స్ మాన్ అగ్గిరాం