05-08-2025 12:31:19 AM
ముషీరాబాద్, ఆగస్టు 4(విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్‌లో మంజురై పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తిచేయాలని, వాటితో పాటు జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్యం పనులను మెరుగుపరచాలని కోరుతూ సోమవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కమిష నర్ ఆర్‌వీ కర్ణన్‌ను గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
గాంధీనగర్ డివిజన్ లో శానిటైజేషన్ పనులు నత్తనడకన సాగుతున్నాయని, అలాగే పెండింగ్ అభివృద్ధి పనుల పై ప్రత్యేక దృష్టి వహించి చర్యలు తీసుకోవాలని వాటితో పాటుగా హెఎండబ్ల్యూఎస్, వాటర్ వర్క్స్ ఏర్పాటు చేసే నూతన సీవరేజి పైప్‌లైన్ పనులకు అనుకూలంగా రోడ్డు త్రవ్వకాలకు అనుమతి ఇవ్వాలని కార్పొరేటర్ కోరా రు.
ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన కమిషనర్ సంబంధిత అధికారులను సమన్వయ పరిచి పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్ పాల్గొన్నారు.