calender_icon.png 19 June, 2025 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుల్డోజర్ బ్రేక్ డ్యాన్స్!

10-05-2024 01:07:54 AM

ఆగ్రా, మే 9: బ్రేక్ డ్యాన్స్ తెలుసు.. క్లాసికల్ డ్యాన్స్ తెలుసు.. కానీ ఈ బుల్డోజర్ డ్యాన్స్ ఏంటనుకుంటున్నారా? అవును ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బుల్డోజర్ పేరు మార్మోగుతోంది. యూపీలోని అలీగంజ్‌లో ఉన్న డీఏవీ కాలేజీలో జరిగిన ఎన్నికల సభలో పాల్గొనేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ రాగానే.. లౌడ్ స్పీకర్లతో మ్యూజిక్ వస్తుండగా.. డ్రైవర్లు డజన్ల కొద్ది బుల్డోజర్లతో బ్రేక్ డ్యాన్స్ స్టంట్స్ చేయించారు. బ్రేకులు, షాక్ అబ్సార్బర్స్ సాయంతో బుల్డోజర్లను డ్యాన్స్ చేయించారు.