calender_icon.png 20 September, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైయారా బ్యూటీకి బంపర్ ఆఫర్

20-09-2025 12:41:07 AM

బాలీవుడ్ యువ కథానాయిక అనీత్ పడ్డా ఇటీవల ‘సైయారా’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ ఫుల్ క్రేజ్‌ను దక్కించుకుంది. ఒక్క సినిమాతోనే అనీత్ రేంజ్ మారిపోయింది. తాజాగా, ఈ ముద్దుగుమ్మ ఓ బంపర్ ఆఫర్‌ను అందుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ప్రేమకథతో తొలిచిత్రం లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ భామ నటిస్తున్న రెండో చిత్రం హారర్ జానర్‌లో రూపొందుతోందని సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం తొలుత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీని ఎంపిక చేసుకున్న టీమ్.. ఆమె తల్లి కావటంతో ప్రాజెక్టు నుంచి తొలగించారట. దినేశ్ విజయన్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా పేరు ‘శక్తి శాలిని’ అని, ఈ సినిమా కోసం యంగ్ బ్యూటీ అనీత్ పడ్డాను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.