calender_icon.png 20 September, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్జున్ సర్జా..మఫ్టీ పోలీస్

20-09-2025 12:39:33 AM

అర్జున్ సర్జా, ఐశ్వర్య రాజేశ్ లీడ్‌రోల్స్‌లో నటిస్తున్న తాజాచిత్రం ‘మఫ్టీ పోలీస్’. జీఎస్ ఆర్ట్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాకు నూతన దర్శకుడు దినేశ్ లెట్చుమనన్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా టీజర్ శుక్రవారం విడుదలైంది. థ్రిల్లింగ్ సన్నివేశాలతో ఆకట్టుకుంటోందీ టీజర్. ‘కొన్నిసార్లు చట్టాన్ని దాటి న్యాయం ఉంటుంది. ఇంకొన్నిసార్లు న్యాయాన్ని దాటి ధర్మం ఉంటుంది.

కానీ మొత్తం లెక్కవేసి చూస్తే చివరికి ధర్మమే గెలుస్తుంది’ అని అర్జున్ చెప్పిన డైలాగ్ స్టొరీ సెంట్రల్ ఐడియాను ప్రజెంట్ చేస్తోంది. అర్జున్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఐశ్వర్య రాజేశ్ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నారు.  ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేమ్ అభిరామి, రామ్‌కుమార్, జీకేరెడ్డి, పీఎల్ తేనప్పన్, లోగు, వేల రామమూర్తి, తంగదురై, ప్రాంక్‌స్టర్ రాహుల్, ఓఏకే సుందర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఆశివాగన్; సినిమాటోగ్రఫీ: శరవణన్ అభిమన్యు; ఎడిటర్: లారెన్స్ కిషోర్; ఆర్ట్: అరుణ్ శంకర్.