20-09-2025 12:42:42 AM
బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీకపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన తాజాచిత్రం ‘హోమ్‌బౌండ్’. విడుదలకు ముందే ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం భారత్ తరఫున అధికారికంగా ఆస్కార్ -2026లో ఎంట్రీ సాధించింది. ఈ విషయాన్నీ చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
నీరజ్ గేవాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీతోపాటు ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా పలు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ సినిమా ప్రదర్శితమైంది. కరణ్ జోహార్, అదార్ పూనావాలా, సోమేన్ మిశ్రా, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.