16 April, 2026 | 10:03 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

హెజ్‌బొల్లాపై ‘బంకర్ బస్టర్’ బాంబులు

28-06-2025 01:17 AM
  1. భూగర్భ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు

భారీగా దెబ్బతిన్న భవనాలు.. పలువురికి గాయాలు

గాజాపై ఆగని దాడులు.. 24 గంటల్లో 72 మంది మృతి

జెరూసలెం, జూన్ 27: ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పశ్చిమాసియా మరోసారి వేడెక్కింది. శుక్రవారం లెబనాన్‌లోని హెజ్ బొల్లా ఉగ్రవాద సంస్థకు చెందిన భూగర్భ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ‘బంకర్ బస్టర్’ బాంబులతో విరుచుకుపడినట్టు ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) ప్రకటించింది. ఈ దాడుల్లో పలువురు హెజ్‌బొల్లా నేతలకు సంబంధించిన ముఖ్యమైన ఆయు ధ స్థావరాలను సైతం ధ్వంసం చేసినట్టు తెలిపారు.

దాడుల్లో భవనాలు దెబ్బతినగా.. పాలస్తీనియన్లు గాయాలపాలైనట్టు లెబనాన్ వా ర్తా సంస్థ పేర్కొంది. శిథిలాల కింద పలువు రు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కొ నసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

గతేడాది నవంబరులో అమరి కా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పం దం జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇజ్రాయెల్ గాజాపై వరుస దాడులకు పాల్పడుతూనే వస్తోంది. గత 24 గంటల్లో గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాతమ దాడుల్లో 72 మంది మృతి చెందగా.. గత నాలుగు వారాల్లో మృతుల సంఖ్య 549కి పెరగ్గా.. గాయపడిన వారి సంఖ్య నాలుగు వేలు దాటడం గమనార్హం.