16 April, 2026 | 8:13 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఆర్‌ఎస్‌ఎస్ ముసుగు తొలగింది

28-06-2025 01:16 AM
  1. వాళ్లకు రాజ్యంగం వద్దు.. మనుస్మృతి కావాలి
  2. రాజ్యాంగ పీఠిక వివాదంపై రాహుల్ గాంధీ విమర్శలు

న్యూఢిల్లీ, జూన్ 27: రాజ్యాంగ పీఠికలోని ‘లౌకిక’, ‘సోషలిస్ట్’ పదాలను తొలగిం చాలని పేర్కొన్న ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే వ్యాఖ్యలపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు. ‘ఆర్‌ఎస్‌ఎస్ ముసుగు మళ్లీ తొలగిపోయింది. రాజ్యాంగం వారికి కోపం తెప్పిస్తుంది ఎందుకంటే అది సమానత్వం, లౌకికవాదం, న్యాయం గురించి మా ట్లాడుతుంది.

అయితే ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లకు రాజ్యాంగంతో పని లేదు.. వాళ్లకు మనుస్మృతి కావాలి. అణగారిన వర్గాలు, పేదల హక్కులను తొలగించి వారిని మళ్లీ బానిసలుగా చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజ్యాంగం వంటి శక్తివంతమైన ఆయుధాన్ని  వారి నుంచి లాక్కోవడమే వా రి నిజమైన ఎజెండా. ఆర్‌ఎస్‌ఎస్ ఇలాంటి కలలు కనడం మానేయాలి.

మేము వారినిఎప్పటికీ విజయవంతం కానివ్వము’ అని ‘ఎక్స్’ వేదికగా రాహుల్ ధ్వజమెత్తారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ అనం తరం 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో ‘లౌకిక’, ‘సోషలిస్ట్’ పదాలను చేర్చిన సంగతి తెలిసిందే.