06-09-2025 11:57:34 PM
వీర్నపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మరిమడ్ల రహదారిలో కంచర్ల గ్రామ సమీపంలో ఆర్ టి సి బస్ బైక్ డి కొన్నాయి. ఈ ప్రమాదంలో వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన భూత వినోద్ తీవ్రంగా గాయపడ్డాడు. ఎల్లారెడ్డిపేట నుండి వీర్ణపల్లికి వెళుతున్న ఆర్టీసీ బస్ వీర్నపల్లి నుండి ఎల్లారెడ్డి పేట కు వెళ్తున్న బూత వినోద్ అనే యువకుడి బైక్ ఎదురెదురుగా డీ కొన్న సంఘటనలో భూత వినోద్ తీవ్రంగా గాయపడ్డగా క్షతగాత్రుడిని వెంటనే ఎల్లారెడ్డిపేట లోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. వినోద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పలువురు ఎల్లారెడ్డిపేట వీర్ణపల్లికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పరామర్శించారు.