06-09-2025 11:52:19 PM
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): మున్సిపాలిటీ లోని అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గ్రృహాల్లో సీజనల్ వ్యాధులు,దోమలు ప్రభలకుండా జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత ఆదేశాల మేరకు వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్ ఆద్వర్యంలో శనివారం అన్ని హాస్టల్స్ లో అల్ఫాసైఫర్ మైత్రిన్ అనే దోమల మందును పిచికారీ చేసినట్లు తెలిపారు. ఈ సీజన్ లో మొదటి రౌండ్ వేసిన 45 రోజుల తర్వాత తిరిగి రెండవ రౌండ్ లో దోమల మందును పిచికారీ చేసినట్లు తెలిపారు.