04-11-2025 03:08:21 PM
							సుల్తానాబాద్,(విజయక్రాంతి): జాతీయస్థాయి సాఫ్ట్ బేస్ బాల్ పోటీలకు ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్ బేస్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ నెలలో జగిత్యాల జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సాఫ్ట్ బేస్బాల్ పోటీలలో సుల్తానాబాద్ స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాల సాయి గణేష్ పదవ తరగతి, ఎస్ సాత్విక్ 9వ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈనెల 7 నుండి 9వ తేదీ వరకు మహారాష్ట్ర షిరిడి లో జరిగే జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ లు మంగళవారం విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తూ ఇండియన్ పబ్లిక్ పాఠశాలకు గర్వకారణమని అన్నారు.