calender_icon.png 4 November, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుక్కల బెడద తీరేది ఎట్లా..?

04-11-2025 03:01:24 PM

ఐదు మందిని కాటు వేసిన వీధి కుక్కలు

హన్వాడ: పట్టణ గ్రామాలు అనే భేదం లేకుండా వీధికి కుల బెడదకు జనం పెబ్బేలెత్తే పరిస్థితులు నెలకొంటున్నాయి. మండల పరిధిలోని పెద్దదర్ పల్లి గ్రామంలో ఒకేరోజు ఐదు మందికి వీధి కుక్కలు కాటు వేశాయి. దీంతో ఐదు మంది మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందారు. ఎలాగైనా వీధి కుక్కలను గ్రామం నుంచి తీసుకుపోయేలా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతుండ్రు. ప్రజలు భయపడుతూ గ్రామంలో తిరగాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని చిన్నపిల్లలపై కూడా కాటు వేసే పరిస్థితిలో ఉన్నాయని ఈ విషయంపై సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.