calender_icon.png 4 November, 2025 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబర్‌పేట కిడ్నాప్ కేసులో 10 మంది అరెస్ట్

04-11-2025 02:53:58 PM

హైదరాబాద్: అంబర్‌పేటలో జరిగిన కిడ్నాప్(Amberpet Kidnapping Case) కేసును పోలీసులు ఛేదించించారు. అక్టోబర్ 29న శ్యామ్ ను దుండగులు కిడ్నాప్ చేశారు. శ్యామ్ ను భార్య మాధవీలతనే కిడ్నాప్ చేయించినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధవీలత అమెరికాలో శ్యామ్ ను పెళ్లి చేసుకున్న మూడు సంవవత్సరాలకే విడిపోయింది. దీంతో శ్యామ్ తన పేరును అలీగా మార్చుకుని ఫాతిమాను రెండో వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకుని అతని కదలికలపై నిఘా పెట్టిన మొదటి భార్య మాధవీలత అమెరికా నుంచి తిరిగి వచ్చిన శ్యామ్ ను సుపారీ గ్యాంగ్ తో కిడ్నాప్ చేయించింది. అనంతరం రూ. 1. 5 కోట్లు డిమాండ్ చేసింది. ఎలానో అలా కిడ్నాప్ గ్యాంగ్ నుంచి తప్పించుకున్న శ్యామ్ పోలీసులను ఆశ్రయించాడు. శ్యామ్ ఇచ్చిన ఫిర్యాదు, వివరాలతో సుపారీ గ్యాంగ్ లోని పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కిడ్నాప్ కథ సుకాంతం, నిందితులు కటకటాల పాలయ్యారు.

హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ(Hyderabad East Zone DCP) బి. బాల స్వామి మీడియాతో మాట్లాడుతూ, “అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కిడ్నాప్, విమోచన కేసులో పది మందిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితురాలు, బాధితుడి భార్య, రూ. 20 కోట్ల విలువైన పూర్వీకుల ఆస్తిని విక్రయించిన తర్వాత అతన్ని అపహరించడానికి మరో తొమ్మిది మందితో కుట్ర పన్నింది. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు రెండు రోజుల్లో బాధితుడిని గుర్తించి, నాలుగు రోజుల్లోనే మిగిలిన వారిని అరెస్టు చేశారు. బాధితుడు శ్యామ్, అతని భార్య మూడు సంవత్సరాలుగా విడివిడిగా నివసిస్తున్నారు. అతను అక్టోబర్ 29, 2025న కిడ్నాప్ చేయబడ్డాడు. తరువాత బంజారా హిల్స్‌లోని తన బ్యాంకు ఖాతా నుండి డబ్బును తీసుకునే ప్రయత్నంలో పారిపోయాడు.” అని హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ వెల్లడించారు.