04-11-2025 03:11:37 PM
							సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రదోషకాలంలో పల్ల అశోక్ అంజలి, అర్జున్ కుమార్ స్వాతి దంపతులు, కాసం నాగరాజు సరిత దంపతులు, నగునూరి వెంకట రామకృష్ణ రూప దంపతులు స్వామి వారికి పలు రకాల పండ్లతో రుద్రాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వల్ల కొండ మఠం రజిత మహేష్ శివాలయం భక్త బృందం పాల్గొన్నారు.