calender_icon.png 4 November, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ క్రీడల్లో ఎంజేపీ విద్యార్థుల హవా

04-11-2025 03:04:24 PM

దౌల్తాబాద్‌: జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ క్రీడల్లో దౌల్తాబాద్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా ఫూలే పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. సిద్ధిపేట, తుప్రాన్ పట్టణాల్లో సోమవారం జరిగిన అథ్లెటిక్స్ అండర్–19, రగ్బీ అండర్–17 విభాగాల్లో పాల్గొని మొత్తం 11 మెడల్స్ సాధించారు. రాష్ట్ర స్థాయి క్రీడల కోసం అథ్లెటిక్స్ విభాగంలో 8 మంది, రగ్బీ విభాగంలో 2 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ స్వప్న మాట్లాడుతూ గ్రామీణ స్థాయి విద్యార్థులు రాష్ట్ర స్థాయికి అర్హత సాధించడం గర్వకారణమన్నారు.విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయులు సాయి కృష్ణ, బస్వరాజ్, డాంబు అభినందించారు.