calender_icon.png 22 August, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియాపై ఆందోళన వద్దు

22-08-2025 12:12:41 AM

* ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ముస్తాబాద్,ఆగస్టు 21(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేం ద్రంలో  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యటించి. ముస్తాబాద్ మల్టీ స్పెషాలిటీ నూతన హాస్పిట ల్ ను ప్రారంభించారు. అక్కడికి వచ్చిన రైతులు సకాలంలో యూరియా అందించాలని ప్రభుత్వ విప్, కేకే కు విజ్ఞప్తి చేశారు.అనంతరం పాత్రికేయులతో విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణకు రావలసిన యూరియా పై కేంద్రానికి అనేకమార్లు లేఖల ద్వారా తెలపడం జరిగిందన్నారు.

9 లక్షల 80 వేల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.ఆగస్టు 20 వరకు 8లక్షల 30 వేల మెట్రిక్ టన్నులు ఇవ్వవలసి ఉండగా ఇప్పటివరకు 5 లక్షల 42 వేల మె ట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందన్నారు. మిగితా రెండు లక్షల 88 వేల మెట్రిక్ టన్నుల యూ రియా రావాల్సి ఉందని వెల్లడించారు.రైతులకు తప్పకుండా సకాలంలో యూరియా అందిస్తామని ఎవరు ఆందోళన చెందవద్దని తెలిపారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందజేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కేటీఆర్ కు యూరియా ఎక్కడినుండి వస్తుందోనని తెలియదా.? అని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ బిజెపి నిజంగా రైతులకు మేలు చేయాలంటే కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమం తదుపరి పోతుగల్ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు, చక్రధర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్రెడ్డి, ఏం సి చైర్మన్ తలారి రాణీ నర్సింలు,సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు,మాజీ ఎంపిటిసి శ్రీనివాస్,నాయకులు దీటి నర్సింలు,యాదగిరి గౌడ్,శ్రీనివాస్,మహిళా నాయకులు రాణి,లక్ష్మి కిషన్ రావు,దర్మేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.