16-05-2025 05:21:14 PM
కామారెడ్డి టౌన్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో మున్సిపల్ కార్మికులకు రెండు నెలల నుంచి జీతాలు రాకపోవడంతో భారీ ధర్నా చేపట్టారు. శుక్రవారం దాదాపు 150 మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి, పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేనందువలన , అందుబాటులో ఉన్న మున్సిపల్ ఆఫీస్ మేనేజర్ గోపాల్ కు 2 నెలల వేతనాలు ఇప్పించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
మున్సిపల్ కమిషనర్ చరవాణిలో అందుబాటులోకి వచ్చి డబ్బులు20 తేదీలోగా అకౌంట్లో డబ్బులువేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దీనితో ఈరోజు దాదాపు 150 మంది పైగా మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టినప్పటికీ కమిషనర్, మున్సిపల్ అధికారులు, ఎవరు స్పందించకపోవడం వలన, చివరికి పోలీసులు వచ్చి మున్సిపల్ కార్మికులను మేనేజర్ దగ్గరికి తీసుకెళ్లి రెండు నెలల వేతనాలు చెల్లించేలా చూడాలని చెప్పడంతో సమ్మె విరమించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో కార్మిక నాయకులు, మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.