calender_icon.png 17 May, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొర్రూర్ మున్సిపాలిటీకి కొత్త ల్యాడర్ కొనుగోలు

16-05-2025 06:05:35 PM

మున్సిపల్ కమిషనర్ శాంతి కుమార్

తొర్రూరు: తొర్రూర్ మున్సిపాలిటీకి కొత్త ల్యాడర్ కొనుగోలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ శాంతికుమార్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కొత్తగా కొనుగోలు చేసి తెచ్చిన లాడర్ పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెయిన్ రోడ్డులో ఉన్న ఐమాక్స్ లైట్లను రిపేర్ చేయించడానికి రూ.2 లక్షల 20వేలతో కొత్తగా ల్యాడర్ కొనుగోలు చేసినట్లు చెప్పారు. దీని వల్ల ఐమాక్స్ లైట్లకు ఎలక్ట్రీషియన్స్ చే నిత్యం పర్యవేక్షణ చేయించి వెలగని ఐమాక్స్ లైట్ల స్థానంలో నూతన ఐమాక్స్ లైట్లను పెట్టిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ రంజిత్, మేనేజర్ కట్టాస్వామి, ఎలక్ట్రీషియన్స్, తదితరులు పాల్గొన్నారు.