calender_icon.png 17 May, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ సమస్య పరిష్కారానికి మంత్రి హామీ

16-05-2025 06:01:15 PM

శ్రీహరి రావు విజ్ఞప్తిని విన్నమంత్రులు

నిర్మల్: లక్ష్మణ చందా మండలంలోని కంజర్ గ్రామం ను రెవిన్యూ రికార్డు లో నుంచి తొలగించడం వల్ల ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దీనికి పరిష్కారం చూపాలని డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి విన్నవించగా సమస్య పరిష్కారానికి మంత్రులు హామీ ఇచ్చారు. కుంటాల మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రులకు కంజర్ గ్రామస్తుల ఆవేదనను డిసిసి అధ్యక్షులు సిఆర్ రావు విన్నవించారు.

గ్రామం రెవిన్యూ రికార్డులో లేకపోవడం వల్ల భూముల క్రయవిక్రయాలు జరగకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని బ్యాంకుల్లో రుణాలు రావడం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూపలేదని తమ ప్రభుత్వం పరిష్కారం చూపాలని మంత్రికి విన్నవించగా ఈ విషయం తన దృష్టికి వచ్చిందని మూడు రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ను మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. మూడు రోజుల్లో కంజర్ గ్రామాన్ని రెవెన్యూ రికార్డులో చేర్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హామీ ఇచ్చారు.