calender_icon.png 17 May, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో జోరుగా వరి ధాన్యం కొనుగోలు: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

16-05-2025 05:27:51 PM

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు లోతృతీయ స్థానం

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో 2024-25 రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు జోరుగా కొనసాగుతున్నదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 446 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వార ఇప్పటి వరకు 62830 మంది రైతుల నుండి 776 కోట్ల  విలువైన 3.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ తో రాష్ట్రంలో కామారెడ్డి  జిల్లా తృతీయ స్థానం లో నిలిచిందని తెలిపారు. దీంట్లో 1.62 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 1.73 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం కొనుగోలు చేశామని. ఇప్పటి వరకు 44495 మంది

 రైతులకు గాను 660 కోట్ల వరకు డబ్బులు చెల్లింపులు కూడా పూర్తయ్యాయనీ తెలిపారు. గతేడాది పోలిస్తే అనగా రబీ 2023-24 ఇదే సమయానికి 50040 రైతుల నుండి 2.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయగా, అదేవిధంగా  ఆ క్రిందటి  ఏడాది అనగా రబీ 2022-23 సీజన్ లో 30264 రైతుల వద్ద నుంచి 1.79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ను కొనుగోలు చేశామన్నారు. గత రెండు సీజన్ లతో పోలిస్తే ఈ రబీ సీజన్ లో ధాన్యం కొనుగోళ్ళు, రైతులకు చెల్లింపులు 40% అధికంగా చేయడం జరిగిందని తెలిపారు.

ఇప్పటి వరకు సన్న రకం ధాన్యం అమ్మిన 18570 మంది రైతులకు బోనస్ చెల్లింపులకు రూ.73.96 కోట్లు ప్రభుత్వానికి సిఫార్సు చేశామన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాలలో అకాల వర్షాలను దృష్టి లో ఉంచుకొని కేంద్రాలలో తగినన్ని టార్పాలిన్ లను ఏర్పాటు చేయాలనీ మార్కెటింగ్ శాఖ వారికి సూచించారు. అలాగే రైతులు తమ వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో  అమ్ముకునే క్రమములో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.