28 April, 2026 | 10:04 PM

మేమున్నాం స్వచ్ఛంద ద్వారా మజ్జిగ పంపిణీ

28-04-2026 08:41 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): మేమున్నాం సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం మజ్జిగ పంపిణీ చేశారు. సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా యోగ బృంద సభ్యుల సహకారంతో,వేసవి నేపథ్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు యోగా గురువు, సేవా సంస్థ నిర్వాహకుడు వెదుళ్ల వీరబాబు తెలిపారు.

సత్తుపల్లి బస్టాండ్ సెంటర్ తో పాటు పాత సెంటర్లో దాదాపు 650 మందికి మజ్జిగ పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా కొంతమేరకు వారికి ఉపశమనం కలిగేందుకు ఈ మధ్యకి పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినామని, ప్రజలు కొంతమేరకు మజ్జిగ పంపిణీ వలన ఊరట చెందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగమణి, శైలజ, సునీత, అభిద్, ఇమామ్, నరసింహారావు పాల్గొన్నారు.