calender_icon.png 18 October, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యూయర్‌షిప్‌లో భారత్, పాక్ మహిళల మ్యాచ్ రికార్డ్

18-10-2025 12:49:57 AM

ముంబై,అక్టోబర్ 17: ప్రపంచ క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా క్రేజ్ మామూలుగా ఉండదు. అటు మహిళల క్రికెట్‌లోనూ ఇదే తరహా క్రేజ్ కనిపిస్తోంది. తాజాగా మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్ వ్యూయర్‌షిప్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఆసియాకప్‌లో పురుషుల జట్లు మూడుసార్లు తలపడడం, నో షేక్ హ్యాండ్ వివాదం వంటివి మరింత హైప్ తెచ్చాయి. దీంతో మహిళల వన్డే ప్రపంచకప్‌లోనూ దాయాదుల మ్యాచ్ ఎలా సాగుతుందోనన్న ఆసక్తి కనిపించిందని క్రికెట్ వర్గాలు తెలిపా యి.

దీనిలో భాగంగానే భారత్ ఆడే ప్రతీ మ్యాచ్‌కూ వ్యూయర్‌షిప్ బాగా వచ్చింది. ముఖ్యంగా పాక్‌తో భారత్ ఆడిన మ్యాచ్‌ను 28.4 మిలియన్ల మంది వీక్షించినట్టు జియో హాట్‌స్టార్ తెలిపింది. అలాగే 1.87 బిలియన్ల మినిట్స్ నమోదయ్యాయి. మహిళల క్రికెట్ లో వ్యూయర్‌షిప్ పరంగా ఇది సరికొత్త రికా ర్డ్. దీని తర్వాత భారత్,ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌కు 4.8 మిలియన్ల వ్యూయర్‌షిప్ వచ్చింది. ఇదిలా ఉంటే సెమీఫైనల్ చేరాలంటే భారత్ మిగిలిన మూడు మ్యాచ్‌లోనూ గెలవాల్సి ఉంది. దీంతో తర్వాతి మ్యాచ్‌లకు కూడా రికార్డ్ వ్యూయర్‌షిప్ రా వొచ్చని అంచనా వేస్తున్నారు.