22-07-2024 01:57:03 AM
హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): సింగరేణి సంస్థలో 272 ఖాళీల భర్తీకి శని, ఆదివారాల్లో 12 సెంటర్లలో నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ఆదేశాల మేరకు తొలిసారిగా హైదరాబాద్ కేంద్రంగా ఈ పరీక్షలను అత్యంత పటిష్టంగా, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ నిర్వహించారు.
శనివారం మూడు షిఫ్టుల లో జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైయినీ, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రెయి నీ హైడ్రోజియాలజిస్ట్, మేనేజ్‌మెంట్ ట్రైయినీ సివిల్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైయినీ (ఐ.ఈ), సబ్ ఓవర్ సిర్ ట్రెయినీ సివిల్ పోస్టులకు పరీక్ష నిర్వహించగా మొత్తం 11,724 అభ్యర్థులకు గాను 7,073 మంది అభ్యర్థులు (60.53 శాతం) పరీక్షలు రాశారు. ఆదివారం ఉదయం బలరాం, డైరెక్టర్ (పర్సనల్, ఆపరేషన్స్) శ్రీనివాస్ పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణలో పాటిస్తున్న జాగ్రతలను సమీ క్షించారు. ప్రాథమిక సమాధాన పత్రాన్ని (కీ) త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
దళారులను నమ్మొద్దు..
పరీక్షల నిర్వహణలో ఎవరి ప్రమే యం ఉండదని, ఎటువంటి రికమండేషన్‌లకు తావు లేదన్న సీఎండీ బల రాం.. సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మోసగాళ్లు, దళారుల మాయ మాటలు నమ్మి మోసపోవొద్దని తెలిపారు. అటువంటి వారి వివ రాలను సింగరేణి విజిలెన్స్ విభాగానికి, పోలీసు శాఖ దృష్టికి తీసుకురా వాలని సూచించారు.