15-11-2025 04:24:11 PM
అలంపూర్: గద్వాల జిల్లా ఉండవల్లి మండలం జోగుళాంబ రైల్వే హాల్ట్ సమీపంలో సుమారు రూ. కోటి పది లక్షల రూపాయల వ్యయంతో ..36 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శనివారం వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య విశేష పూజలతో ఆధ్యాత్మికత, భక్తి భావం ఉట్టిపడేలా భారీ విగ్రహా ప్రతిష్టపాన మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆయా ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పలు పూజలు చేశారు.
కాగా ఉండవల్లి మండల కేంద్రానికి చెందిన ఉప్పలపాటి కోడుమూరు నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు ఈ భారీ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఉప్పలపాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ... గత 15 ఏళ్ల కిందట నుంచి స్వామి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించుకున్నట్లు తెలిపారు. సరైన స్థల సేకరణ లేక ఇన్నాళ్లు కుదరలేదన్నారు. నేడు అభయాంజనేయ స్వామి విగ్రహా ఏర్పాటుతో తన నిరీక్షణ ఫలించిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అంతేకాక విగ్రహం చుట్టూ సీతారాముల వారు, పంచముఖి ఆంజనేయస్వామి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్యం స్వామి గ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు.ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.అనంతరం భక్తులు భోజన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.