15-11-2025 04:13:16 PM
నిర్మల్,(విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే వరకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ అన్నారు. శనివారం నిర్మల్ పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జాడుకలామ్ యాత్ర ప్రారంభించారు ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరుగుతుందని ఆ సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వినోద్ సాదిక్ హైమత్ తదితరులు పాల్గొన్నారు.