15-11-2025 04:25:38 PM
నిర్మల్ (విజయక్రాంతి): దిల్వార్పూర్ మండలంలోని సిర్గాపూర్ గ్రామంలో శనివారం నిర్వహించిన నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమంలో మాజీ దేవదాయ శాఖ మంత్రి ఏ ఇంద్రకన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవదాయ శాఖ మంత్రిగా తన హయాంలో నిధులు మంజూరు చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్ యాదవ్ రెడ్డ రమణారెడ్డి పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు.