calender_icon.png 15 November, 2025 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ దేవతలకు అభిషేకాలు: చైర్మన్ కొండాలక్ష్మయ్య

15-11-2025 04:15:15 PM

మోతె: మండల పరిధిలోని నరసింహపురం గ్రామంలో గ్రామ దేవతలకు అభిషేకాలు నిర్వహించడం జరిగిందని రామాలయ  చైర్మన్ కొండా లక్ష్మయ్య చెప్పారు. లక్ష దీపోత్సవం శనివారం మండల పరిధిలోని నరసింహపురం గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా గ్రామ దేవతలకు గంగ జలంతో అభిషేకం చేసి గ్రామంలో ఉన్న గంగాదేవి బ్రిడ్జి మైసమ్మ బొడ్రాయి వంటి దేవాది  దేవతలకు పసుపు కుంకుమలు పువ్వులు పాల కాయలు నైవేద్యములు సమర్పించి గ్రామంలో చిన్న పెద్దలు కులాల మతాల అతితంగా ప్రతి ఒక్కరు బ్యాండ్ భాజాలతో వీధులన్నీ కలియతిరిగి ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం లక్షదీపాలతో అభిషేకం చేసి దేవాది దేవుళ్లకు మహిమ పరిచారు. జల బిందెలతో అభిషేకం నిర్వహించడం జరిగింది. అనంతరం గ్రామ ప్రజలందరికీ అన్న దానం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ కొండలక్ష్మయ్య, మాజీ ఎంపీపీ శీలం ఉమా సైదులు, సునీత, గ్రామస్తులు కమిటీ  సభ్యులు గ్రామ దేవాలయం అర్చకులు అజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.