15-11-2025 04:38:38 PM
నిర్మల్ (విజయక్రాంతి): తన కూతురు పుట్టిన రోజు నాడు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని భావిస్తున్న ఈ రోజుల్లో నిర్మల్ మండలంలోని అక్కపూర్ గ్రామానికి చెందిన మారుతి రెడ్డి వినూత్నంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న తోటి విద్యార్థులకు విహారయాత్రను ఏర్పాటు చేశారు. కూతురు రిత్విక పుట్టినరోజును పురస్కరించుకొని తోటి విద్యార్థులకు విహార యాత్ర కోసం 15 వేలు ఆర్టీసీకి చెల్లించి విద్యార్థులను ఆర్టీసి బస్సులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను యాత్రకు పంపించారు. కూతురితో పాటు ప్రభుత్వ విద్యార్థులు హాయిగా కళాక్షేపం గడుపుతూ బాసర కదిరి దేవాలయం కల్లూరు సాయిబాబా ఆలయాలను సందర్శించి వేడుకలను జరుపుకున్నారు. నిర్మల్ డిఎం పండరీ జన్మదిన వేడుకల్లో యాత్రానందాన్ని సద్వినియోగం చేసుకోవడం అభినందనీయమని తెలిపారు