15-11-2025 04:10:51 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం బిర్సా ముండా జయంతి వేడుకలను గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బిర్సా ముండా చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆదివాసీల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు గిరిజనులకు ఎంతో ప్రయోజనం చేకూర్చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఓ జీవరత్నం మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మోహన్ సింగ్ బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్ గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.