calender_icon.png 15 November, 2025 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టాఫ్ బాల్ క్రీడాకారుల ఎంపిక

15-11-2025 04:30:47 PM

నిర్మల్ రూరల్ (విజయక్రాంతి): పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అండర్ సెవెంటీన్ ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ సాఫ్ట్ బాల్, నెట్ బాల్ పోటీలను శనివారం నిర్వహించడం జరిగింది. దీనికి వివిధ పాఠశాలల నుండి 200 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఇందులోనుండి సాఫ్ట్బాలకు 16 మంది బాయ్స్ అండ్ గర్ల్స్ నెట్బాల్ కు 12 మంది బాయ్స్ అండ్ గర్ల్స్ ను సెలెక్ట్ చేయడం జరిగింది. సెలెక్ట్ అయిన విద్యార్థులు ఆదిలాబాద్ జిల్లాలోని నెట్ బాల్ సోనాలలో నిర్వహిస్తున్నారు. 17వ తారీఖున నిర్వహించదలిచారు.

18వ తారీఖున సాఫ్ట్బాల్ బజార్హతనూరులో నిర్వహించదలిచారు. ఇందులో సెలెక్ట్ అయిన విద్యార్థులు మన నిర్మల్ జిల్లా నుండి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీనికి ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ రవీందర్ గౌడ్, కన్వీనర్ అన్నపూర్ణ, సీనియర్ వ్యాయామ, ఉపాధ్యాయులు రమణారావు, మహిళా ఉపాధ్యాయులు అనిత రాథోడ్ సంజు రాథోడ్ ఆర్గనైజర్ సంజీవ్. గస్కంటి గంగాధర్, వ్యాయామ ఉపాధ్యాయులు గిరి ముఖేష్ హనుమాన్లు అలహాస్ సతీష్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు.