15-11-2025 04:08:18 PM
సిద్దిపేట క్రైం: విద్యార్థి దశలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని సిద్ధిపేట త్రీటౌన్ ఎస్ఐ నర్సింలు అన్నారు. శనివారం సిద్దిపేట కేంద్రీయ విద్యాలయ పాఠశాల విద్యార్థులకు చట్టాలు, వాటి ద్వారా రక్షణ ఎలా పొందవచ్చు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. షీటీమ్ విధులు, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, ఫోక్క్సో, యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్, సైబర్ నేరాల గురించి వివరించారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. చదువుకునే వయసులో దురలవాట్లకు బానిస కావొద్దని హితవు పలికారు. ఎవరైనా వేధింపులకు గురి చేసినా, అవహేళనగా మాట్లాడినా డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ షీటీమ్ నెంబర్ (8712667434) కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో సిద్దిపేట షీటీమ్ ఏఎస్ఐ కిషన్, మహిళ కానిస్టేబుళ్లు రజని, మమత, కానిస్టేబుళ్లు ప్రవీణ్, లక్ష్మీనారాయణ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఏఎస్ఐ ఓదేలు పాల్గొన్నారు.