15-11-2025 04:43:46 PM
ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సెట్విన్ లో ఓజెటి శిక్షణ ప్రారంభం..
గజ్వేల్: యువతకు సాంకేతిక శిక్షణ ద్వారా మార్కెట్లో చక్కని ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం గజ్వేల్ పట్టణంలోని సెట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఒకేషనల్ కోర్సులైన ఓ.ఏ.ఎస్, ఎం. ఈ, ఈ అండ్ సి. టీ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు సాంకేతిక శిక్షణను ప్రారంభించారు. విద్యార్థులకు సెట్విన్ శిక్షణ కేంద్రంలో ఎమ్మెస్ ఆఫీస్, ఎయిర్ కండిషన్, ఫ్రిడ్జ్ రిపేర్, ఎలక్ట్రిషన్ అంశాలపై ప్రయోగపూర్వకంగా శిక్షణ అందిస్తున్నారు.
150 మంది విద్యార్థులకు 45 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు సెట్విన్ ఇంచార్జ్ కదిరి తెలిపారు. సెటిల్ లో తక్కువ ఖర్చుతో అందించే కోర్సులను పేద విద్యార్థులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాబోయే వేసవి సెలవుల్లో మరిన్ని కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాల లెక్చరర్లు ఆశ్రఫ్, నర్సింలు, రాజిరెడ్డి, ఉపేందర్, ఆమీర్, సెట్విన్ సిబ్బంది పాల్గొన్నారు.