calender_icon.png 6 July, 2025 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందు మీరో క్లారిటీకి రండి సార్?

06-07-2025 01:10:03 AM

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పీసీసీ చీఫ్ ఖర్గే ముఖ్యఅతిథిగా శుక్రవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమరభేరీలో సీఎం రేవంత్‌రెడ్డి తాము రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 100కు ఒక్క సీటు తగ్గకుండా కైవసం చేసుకుని సత్తా చాటుతామని జోస్యం చెప్పారు. ఆశ్చర్యకరంగా అదే రోజు గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఇందుకు భిన్నం గా స్పందించారు.

తాము రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లు సాధించి అధికారంలోకి రావడం గ్యారెంటీ అని పేర్కొన్నారు. ఇది చూసిన విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు కాంగ్రెస్‌లో నాయకుల తీరే ఇంత అని చర్చించుకుంటున్నారు.

నేతలు ఓ మాట మీద లేకపోవడం, సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని చర్చించుకుంటున్నారు. అసలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 సీట్లు సాధిస్తుందా లేక వంద సాధిస్తుందా.. ఏదో ఒకటి కరెక్ట్ నంబర్ చెప్పండి సారూ.. అంటూ సెటైర్లు వేస్తున్నారు.

విజయభాస్కర్