calender_icon.png 26 July, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి, మత్తు పదార్థాలపై అవగాహన ఎంతోకీలకం..!

25-07-2025 11:54:30 PM

గంజాయి, మత్తుపదార్థాల నియంత్రణ సదస్సు

బెల్లంపల్లి రూరల్ సీఐ సిహెచ్ హనోక్

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): గంజాయి మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన ఎంతో కీలకమని బెల్లంపల్లి రూరల్ సిఐ సిహెచ్ హనోక్ అన్నారు. శుక్రవారం సెయింట్ మేరీ హై స్కూల్ లో గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణల పై జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. గంజాయి, మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు  విద్యార్థులకు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ కార్యాచరణ, దిశనిర్దేశo చేశారు. గంజాయి, మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు అందరికీ తెలిసి ఉండాలన్నారు. ఇంట్లో తల్లితండ్రులకు వాటి గురించి అవగాహన తప్పనిసరన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి టూ టౌన్ ఏ ఎస్ఐ ఆర్ తిరుపతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.