25-08-2025 02:05:33 AM
- అదుపుతప్పి ప్రహరీని ఢీకొట్టిన కారు
- నుజ్జునుజ్జు కారు ముందు భాగం
- తప్పిన పెను ప్రమాదం
- ఐదుగురు యువకులు అరెస్ట్
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 24 (విజయక్రాంతి): బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద ఓ కారు భీభత్సం సృష్టిం చింది. అతివేగంతో అదుపుతప్పిన కారు, ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లి పార్క్ ప్రహరీని బలంగా ఢీకొట్టింది. అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ పార్క్ వద్ద జరిగిన ఈ ఘటన స్థానికులను, వాకర్లను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఆదివారం ఉదయం వాకర్లతో, మారథాన్ రన్నర్లతో కేబీఆర్ పార్క్ పరిసరాలు సందడిగా ఉన్నాయి.
అదే సమయం లో ఐదుగురు యువకులతో ఉన్న ఓ కారు అతివేగంతో దూసుకొచ్చింది. కారు అదుపుతప్పి, ముందుగా ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లి, ఆపై అదే వేగంతో పార్క్ గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రహరీ కొంతభాగం కూలిపోగా, కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఫుట్‌పాత్‌పై ఎవరూ లేకపోవడం తో పెను ప్రమాదం తప్పింది. ఒకవైపు మారథాన్ జరుగుతుండగా, మరోవైపు ఈ ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఉన్న ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు. కారును నడిపిన యువకుడు మద్యం మత్తులో ఉ న్నాడా, లేక కేవలం అతివేగమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నగరంలో యువకు లు గ్రూపులుగా చేరి కార్లతో స్టంట్లు చేయ డం, రేసింగ్‌లకు పాల్పడటం ఇటీవల ఎక్కువైందని, పోలీసులు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.