25-08-2025 02:39:49 PM
హైదరాబాద్: విద్యుత్ స్తంభాలపై ఇంటర్నెట్, కేబుల్ వైర్ల తొలగింపుపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్ల వల్లనే ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు పోలీసులు నిర్దరించారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ(GHMC) వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను అధికారులు తొలగిస్తున్నారు. దీంతో ఎయిర్‌టెల్(Airtel) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అనుమతి ఉన్న కేబుళ్లను సైతం అధికారులు తొలగిస్తున్నారని ఎయిర్టెల్ సంస్థ తరపు న్యాయవ్యాది కోర్టుకు వివరించారు. టీజీఎస్పీడీసీఎల్(TGSPDCL) తరపు న్యాయవ్యాది ఏయే స్తంభాలకు అనుమతి తీసుకున్నారో చూపించాలని కోరారు. రెండు వైపుల వాదనలు విన్న బి.వి. నాగరత్న ధర్మాసనం.. అనుమతిలేని కేబుళ్లను తొలగించవచ్చని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా, ఇటీవల రామంతపూర్ విద్యుత్ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.